![]() |
![]() |
(12).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 358లో...తనకు స్పాన్సర్‌గా ఒక పెద్ద కంపెనీ అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రావడంతో గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగ స్వీట్ తీసుకొని వచ్చి అందరికి పంచుతుంది. నువ్వు మా కంటే గ్రేట్ గంగ అని ప్రమీల అంటుంది. అప్పుడే శకుంతల వచ్చి.. ఇక్కడ ఏం జరుగుతుందని కోపంగా అడుగుతుంది. గంగకి రెండు కోట్లు ఇచ్చి స్పాన్సర్‌గా ఉండటానికి ఒక పెద్ద కంపెనీ ముందుకు వచ్చిందని పెద్దసారు చెబుతాడు. అమ్మగారు నన్ను ఆశీర్వదించండి అని గంగ అనగానే శకుంతల దూరంగా వెళ్తుంది. స్వీట్ తీసుకోండి అని గంగ ఇస్తే.. ఆ స్వీట్ తీసుకొని ఎవరూ చూడకుండా కింద పడేస్తుంది. అది వీరు, రుద్ర చూస్తారు.
ఆ తర్వాత పిల్లో కింద గంగ కోసం రుద్ర చాక్లెట్ పెడతాడు. అమ్మో.. చాక్లెట్ తింటే సర్ తిడతారని గంగ అనుకుంటుంది. అప్పుడే రుద్ర వచ్చి.. ఆ చాక్లెట్ నేనే పెట్టాను గంగ గారు అనగానే అదేంటి సర్ నన్ను అలా అంటున్నారని గంగ అంటుంది. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవి అని రుద్ర అంటాడు.
అదంతా ఏం కాదు, మీరే నాకు ఎప్పుడూ స్పెషల్ అని గంగ అంటుంది. సరే నీ కోసం రోజూ పాలు తీసుకొని వస్తానని రుద్ర అంటాడు. ఆ తర్వాత శకుంతల, వీరు, ఇషిక ముగ్గురికి గంగ అగ్రిమెంట్ చేసుకోవడం ఇష్టం ఉండదు. దాంతో ఆమె వెళ్లకుండా ఆపాలని ఆమె తాగే పాలలో నిద్ర మాత్రలు కలుపుతారు. ఆ తర్వాత తెలియకుండా రుద్ర ఆ పాలను తీసుకెళ్లి గంగకి ఇస్తాడు. గంగ అవి తాగుతుంది.ఆ తర్వాత రుద్ర, విశ్వ అందరు గంగ కోసం చూస్తారు. రుద్ర ఫోన్ చేస్తాడు కానీ గంగ లిఫ్ట్ చేయదు. స్పాన్సర్లు గంగతో అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ గంగ మాత్రం నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |